జనగామ రూరల్: యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరగాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకం యంత్రాలు, తడి కొలిచే పరికరాలు, గోదాముల సదుపాయం, టార్పాలిన్లు, గన్నీ సంచులు, తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సమావేశంలో డీఎంసీఎస్ హాథీరామ్, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఏఓ అంబి కా సోనీ, డీఆర్డీఓ వసంత, డీసీఎస్‌ఓ పావని, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అమలుచేయాలి
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జిల్లా వైద్య శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రగతి ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు, డీసీహెచ్‌ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
పారాక్వాట్ మందుపై తాత్కాలిక నిషేధం
పారాక్వాట్ మందుపై 60 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పారాక్వాట్ మందును ఎవరూ కొనుగోలు చేయకూడదని, నిల్వ ఉంచరాదని, వ్యవసాయ డీలర్ దుకాణాలు ఈ మందును అమ్మకూడదన్నారు.
పీహెచ్‌సీ, గురుకులంలో తనిఖీలు..
జఫర్‌గఢ్: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సూచించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు విభా గాలను పరిశీలించారు. డెంటల్ విభాగం స్కానింగ్ సెంటర్, మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు డయాలసిస్ తీసుకుంటున్న రోగులతో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థినులకు పోషకాహారం అందించాలి
స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ వంటశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనం పరిశుభ్రంగా ఉండడంతో పాటు పోషకాహారంతో అందించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ విషయంలో పలు సూచనలు చేశారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


