● పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామ అభివృద్దికి ప్రత్యేక చొరవతో పనిచేస్తానని, శ్రీ పెద్దమ్మతల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకాంక్షించారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉత్సవాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై పెద్దమ్మతల్లికి, ఎల్లమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్థుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నెలరోజుల్లో రూ.10లక్షలు మంజూరు చేస్తానన్నారు. అక్కపెల్లిగూడెం క్రాస్ నుంచి సత్రంకుంట వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మందపురం రాణిఅనీల్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు నాగరబోయిన శ్రీరాములు, పురమాని రజాక్‌యాదవ్, ఉపసర్పంచ్ రాజు, దేవస్థాన చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు లింగనబోయిన అశోక్, దేవస్థాన వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి అన్నెపు యాకయ్య పాల్గొన్నారు.


