బార్‌ అసోసియేషన్‌ కమిటీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ కమిటీ బాధ్యతల స్వీకరణ

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

జనగామ రూరల్‌: కొత్తగా ఎన్నికై న జనగామ బార్‌ అసోసియేషన్‌ కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. బార్‌ అధ్యక్షుడిగా బండ దయాకర్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ తాళ్లపల్లి రాజయ్య, జనరల్‌ సెక్రెటరీ మన్నే సత్తయ్య, ట్రెజరర్‌ నేతి శ్రీమాన్‌, జాయింట్‌ సెక్రెటరీ గుండెల్లీ రాజశేఖర్‌, కల్చరల్‌ స్పోర్ట్స్‌ సెక్రటరీ ఆలే బాలరాజు, లైబ్రరీ సెక్రెటరీ బద్రీనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వినయ్‌, పుష్ప, స్వాతి, శ్రీనివాస్‌, దయామని వంశీకృష్ణ, శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి చట్టం పరిధిలో జరగాల్సిన పనులు చేపడుతామని, న్యాయబద్ధంగా వ్యవహరి స్తామన్నారు.

ఏఎంసీ అవినీతిపై విచారణ జరిపించాలి

తెలంగాణ రైతు సంఘం వినతి

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రంజిత్‌ రావుకు వినతి చేశారు. ఈ సందర్భంగా భూక్య చందు నాయక్‌ మాట్లాడుతూ.. గతంలో పల్లికాయ కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పల్లికాయ, చింతపండు కొనుగోళ్లలో జీరో వ్యాపారం నడుస్తోందన్నారు. మార్కెట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతీ ఉత్పత్తిని ఈ నామ్‌ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement