తల్లులకు ‘ఈ– కానుక’
ఏటూరునాగారం: గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. అయితే కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు.


