సెర్ప్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి
జనగామ: సెర్ప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్డీఏ పీడీ వసంతకు శనివారం వినతిపత్రం అందించారు. జేఏసీ ప్రతినిధులు యాదారపు రవి, సంపత్, శంకరయ్య, నరేందర్, నాగేశ్వరావు, జ్యోతి, ఎల్లస్వామి, సదానందం, యాదగిరి, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సెర్ప్ సిబ్బంది గత రెండు దశాబ్ధాల కాలం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయల రుణాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషించామన్నారు. పీఆర్‌ఆర్డీ శాఖ సర్వీస్ రూల్స్‌ను వందశాతం వర్తింప జేయడంతో పాటు జీఓ నంబర్ 11 ప్రకారం ప్రస్తుత క్యాడర్లపై మరో రెండు క్యాడర్లు పెంచి అమలు చేయాలన్నారు. సెర్ప్ సిబ్బంది చాలా మంది 50 ఏళ్ల వయస్సు దాటుతున్నా, తగిన బెనిఫిట్లు అందకపోవడం, అధిక పని ఒత్తిడి కారణంగా మరణాల శాతం కూడా పెరుగుతోందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది.


