బందగీ పోరాటం చిరస్మరణీయం
దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ విమోచనోద్యమంలో నిజాం సర్కార్ అంతర్భాగమైన దేశ్‌ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన షేక్ బందగీ భూసమస్యపై పోరాటం చిరస్మరణీయమని సీపీఐ అనుబంధ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెల్ల రవి, రైతు సంఘం జిల్లా నాయకుడు బిల్లా తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కామారెడ్డిగూడెం బస్‌స్టేజీ వద్ద బందగీ 86వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్తూపం వద్ద సీపీఐ, సమాధి వద్ద ముస్లింలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బందగీ న్యాయపోరాటం ఆదర్శనీయమన్నారు. బందగీ జీవిత పోరాటం తెలిపే ప్రజానాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బందగీ వారసులు సాబీర్, ఖుద్దూస్, వాజీద్, జాకీర్‌హుస్సేన్, రబ్బానీ, మాజీ ఎంపీటీసీ జాకీర్, మౌలానా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజానాట్యమండలి
రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి


