ప్రొటోకాల్‌పై నిలదీత
లింగాలఘణపురం: మండల కేంద్రంలో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ అనంతరం తహసీల్దార్ రవీందర్‌ను ప్రొటోకాల్‌పై బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు నిలదీశారు. మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ను వేదికపై పిలువలేదని, నామినేటెడ్ పోస్టులైన మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఏ విధంగా పిలుస్తారని స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య, అదేవిధంగా సమావేశానికి ఆహ్వానించి చెక్కుల పంపిణీ సయమంలో కనీసం తమ పేర్లను కూడా పిలువలేదని వడిచర్ల సర్పంచ్ కార్తీక్, నాగారం సర్పంచ్ గొరిగె ఉప్పలమ్మ, కొత్తపల్లి సర్పంచ్ విష్ణు తహసీల్దార్ తీరుపై మండిపడ్డారు. మరోసారి పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎడ్ల రాజు, గొరిగె అనిల్, బండ చంద్రమౌళి, వీరయ్య, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
తహసీల్దార్ తమను అవమానించారని బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఆందోళన


