జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
సుధీర్‌రంజన్‌ను సత్కరిస్తున్న మంచాల రవీందర్, గుండెల్లి రాజశేఖర్, ఉడుత ఉపేందర్, కోటా శంకర్
జనగామ: కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన స్టాండింగ్ గవర్నమెంట్, అడిషినల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిళ్ల తాజా నియామక ఉత్తర్వు బుధవారం వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులను కీలక పదవుల్లో నియమిస్తూ భారత ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌కు సీనియర్ న్యాయవాది చిలువేరు సుధీర్‌రంజన్ నియమితులు కాగా, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు మరో ముగ్గురు న్యాయవాదులు కోటా శంకర్, ఉడుత ఉపేందర్ యాదవ్, గుండెల్లి రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడంలో వీరు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ నియామకాలు మూడు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమలులో ఉంటాయని న్యాయ మంత్రిత్వశాఖ సెక్రెటరీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన న్యాయవాదులకు ఒకేసారి నలుగురికి బాధ్యతలు దక్కడంపై జిల్లా న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిలువేరు సుధీర్‌రంజన్‌ను జిల్లా చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ ఘనంగా సన్మానించి, మిగతా ముగ్గురు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు.
స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్‌కు నలుగురు
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం


