నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం
నర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిషకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆహ్వానం అందినట్లు పీజిహెచ్‌ఎం నీలం వేణు బుధవారం తెలిపారు. నవంబర్‌లో బాలల దినోత్సవం సందర్భంగా అకాడమీ చిన్నారులకు కథా రచన పోటీలను నిర్వహించగా అభినిష ప్రత్యేక బహుమతి పొందింది. కాగా, రాష్ట్రస్థాయిలో ఎంపికై న బాలల కథలను ‘బాలల ప్రపంచం’ పేరుతో అకాడమీ ముద్రించిన పుస్తకాన్ని ఈ నెల 27న రవీంద్రభారతిలో ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ఈసందర్భంగా అభినిషకు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినిషను అభినందించారు.
కొడకండ్ల: మండలంలోని ఏడునూతుల ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్.అనీల్ ఉమ్మడి జిల్లా ఖోఖో టీమ్‌కు ఎంపికై నట్లు పీడీ సంధ్య తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అనీల్ ఖోఖోలో ప్రతిభను చాటుకొని ఈ నెల 30న వికారాబాద్ తాండూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి వరంగల్ తరఫున పాల్గొననున్నట్లు పీడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనీల్‌ను హెచ్‌ఎం యాక య్య, ఉపాధ్యాయులు అభినందించారు.
జనగామ: రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ, ఆంటీ క్వాక (ఇల్లీగల్ మెడికల్ ప్రాక్టీస్ వ్యతిరేక) కమిటీ కన్వీనర్‌గా జనగామకు చెందిన డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్ నియమితులయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా అమలుచేస్తానన్నారు. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, అశోక్, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ దయాల్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగుడి నిజాయితీ
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఆసుపత్రికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి బంగారం, నగదు ఉన్న పర్సును ఓపీ కౌంటర్ వద్ద పోగొట్టుకున్న సంఘటన బుధవారం జరిగింది. ఈ సమయంలో బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మట్టి కిషన్, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు హాస్పిటల్‌కు రాగా, ఓపీ కౌంటర్ వద్ద పర్సు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ కల్నల్ భిక్షపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంకు అందజేశారు. పర్సు పోగొట్టుకున్న బాధితులు అప్రమత్తం కాకపోవడంతో ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బంగారు ఆభరణాలు, నగదు పోగొట్టుకున్న బాధితులు ఆస్పత్రికి వస్తే పూర్తి వివరాలు సేకరించి, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అప్పగిస్తామని సూపరింటెండెంట్ డాక్టర రాజలింగం తెలిపారు. పర్సులో సుమారు 10 గ్రాముల బంగారం ఆభరణాలతో పాటు రూ.2వేల నగదు ఉంది.
నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం
నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం
నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం


