కొరత తీరుస్తున్న
కూలీల కొరత తీరింది..
మా రాష్ట్రంలో పనులు లేవు..
‘పొరుగు’ కూలీలు!
బచ్చన్నపేట: యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో స్థానిక ఎన్నికలు రావడంతో అన్నదాతలు ఆలస్యంగా నార్లు పోశారు. స్థానిక ఎన్నికల తర్వాత అందరూ ఒకేసారి వరినాట్లు చేపట్టంతో కూలీల కొరత నెలకొంది. కూలీలకు ప్ర స్తుతం ఒకరికి రూ.500ల వరకు చెల్లించినా దొరక డం లేదు. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి కొందరు మిషన్ నాటుకు నార్లు పోశారు. వరి నాట్లు నారు పోసిన 30 రోజుల్లో నాటు వేస్తేనే సరైన పంట దిగుబడి వస్తుంది...లేకుంటే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో రైతులు నాటు కోసం నానా పా ట్లు పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బిహార్, మహారాష్ట్ర, నెల్లూరు నుంచి కూలీలను రప్పించి వరినాట్లు వేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఒక ఎకరానికి రూ. 5,500 నుంచి రూ.6000ల వరకు తీసుకుంటున్నారు. కూలీలను వేరే గ్రామాలకు తీసుకెళ్లడానికి రైతులు ఆటోచార్జీలను కూడా భరిస్తున్నారు. ఈ కూలీలు కనీసం 20 నుంచి 30 మంది చొప్పున బ్యాచ్‌లుగా ఉండి ఒక రోజు కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా వరినాట్లు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రాకపోతే నాటు వేయడం మరింత కష్టంగా మారేదని పలువురు అన్నదాతలు అంటున్నారు.
నారుమడిలో నారు తీస్తున్న బిహార్ కూలీలు
బచ్చన్నపేటలో వరి నాట్లు వేస్తున్న మహారాష్ట్ర కూలీలు
నాకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంటను సాగు చేస్తాను. అన్నదాతలు అందరూ ఒకేసారి నాట్లు వేస్తుండడంతో గ్రామంలో ఉన్న కూలీ లు సరిపోవడం లేదు. పరాయి రాష్ట్రాల నుంచి కూలీలు రావడంతో సకాలంలో వరి నాట్లు పడుతున్నాయి. కూలీల కొరత తీరుతుంది.
– శేఖర్‌రెడ్డి, రైతు, బసిరెడ్డిపల్లి
మా రాష్ట్రంలో సరిపడా పనులు లేక తెలంగాణకు ఉపాధి కోసం భార్యభర్తలం వచ్చాం. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి సా యంత్రం 6 గంటలకు వరకు ప ని చేస్తే మాకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా గిట్టుబాటు అవుతుంది. నెల రోజుల పాటు ఒక్కడ ఉంటాం. తర్వాత మా రాష్ట్రం వెళ్లిపోతాం. – ప్రవీణ్, కూలీ, మహారాష్ట్ర
ఎన్నికల తర్వాత ఒకేసారి అన్నదాతల వరినాట్లు
స్థానికంగా కూలీలు దొరక్క ఇబ్బందులు
మహారాష్ట్ర, బిహార్, ఏపీ రాష్ట్రాల నుంచి కూలీల రాక
చకచకా నాట్లు పడుతుండడంతో
ఊపిరి పీల్చుకుంటున్న రైతులు
కొరత తీరుస్తున్న
కొరత తీరుస్తున్న
కొరత తీరుస్తున్న


