
వానకొండయ్య జాతరకు సకల సౌకర్యాలు
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
దేవరుప్పుల: శ్రీవానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర నాటికి సకల సౌకర్యాలు కల్పించేలా పనులు వేగవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తన నివాసంలో దేవాదాయశాఖ అధికారులతో కడవెండి శివారులోని శ్రీవానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.కోటి నిధులు వినియోగంపై సమీక్ష జరిపారు. కల్యాణమండపం, అన్నదానసత్రం, భక్తులకు తాగునీటి సౌకర్యం, దీపాలంకరణ, సేద తీరేందుకు భవన సముదాయం వంటి మౌలిక వసతుల పనులు సత్వరమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.