
అలుగు పడితే ఆగుడే
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025
జనగామ: రాష్ట్రమంతటా భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు..ఉప్పొంగుతున్న వాగులు..నిండు కుండలా చెరువులు..కానీ జనగామ జిల్లాలో నామమాత్రంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దగా ఇబ్బంది లేకుండానే లోలెవల్ కాజ్‌వే, బ్రిడ్జిల వద్ద రాకపోకలు సాగుతున్నాయి. ఏటా జోరు వర్షాలతో వరద ఉధృతి పెరిగి రఘునాథపల్లి, లింగాలఘనపురం, జఫర్‌గడ్, పాలకుర్తి, బచ్చన్నపేట, జనగా మ రూరల్, నర్మెట తదితర మండలాల పరిధిలో అనేక గ్రామాలకు రోజుల తరబడి రవాణా సౌకర్యం, రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అయినప్పటికీ శాశ్వత బ్రిడ్జిల నిర్మాణం, ప్రమాదకరమైన రోడ్ల మరమ్మతులు తాత్కాలికంగా చేస్తున్నారు. ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వరదలు లేవు. భారీ వర్షాలు కురియకముందే రవాణా కు అంతరాయం కలుగకుండా బ్రిడ్జిలు, లో లోవల్ కాజ్‌వేలు, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు, కట్టల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి వరదల పరిస్థితి జిల్లాలో రాకుండా చూడాలని సూచిస్తున్నారు.
గండి పడి..
రఘునాథపల్లి: మండలంలోని మేకలగట్టు నుంచి మచ్చుపహాడ్‌కు వెళ్లే తాత్కాలిక రోడ్డుకు గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినా, విద్యుత్ లైన్లు కిందకు ఉండడంతో రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇబ్రహీంపూర్ గ్రామ పెద్దచెరువు వద్ద బ్రిడ్జి లేకపోవడం, మండల గూడెం వద్ద కాజ్‌వే దెబ్బతినగా, అలుగు దాటుతూ ప్రజలు నరకం చూస్తున్నారు. బానాజీపేట, కోడూరు, రామన్నగూడెం వాగుపై బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో వాగు ఉధృతమైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.
రోడ్డు తెగితే కష్టమే..
నర్మెట్ట: భారీ వర్షం కురిస్తే వెల్దండ ఊరచెరువు మత్తడి రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది. జనగామ రహదారి మండల కేంద్రానికి సమీపంలో లోలెవల్ కాజ్‌వే కోతకు గురైంది. తండాలకు వెళ్లే రూట్లలో భారీ వర్షాలతో లో లెవల్ కాజ్‌వేలను ముంచేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతాయి.
ప్రధాన రూట్ అయినా..
జనగామ రూరల్: జనగామ–హుస్నాబాద్ ప్రధాన రూట్ గానుగుపాడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికల్వర్టు ప్రమాదకరంగా మారింది. నూతన బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ కట్టపై అదుపు తప్పి తే అంతే. జనగామ నుంచి చీటకోడూరులో లెవల్ బ్రిడ్జి, సిద్దెంకి–పెద్దరామన్‌చర్ల, ఎర్రగొళ్లపహాడ్–పెద్దతండా, జనగామ నుంచి పోచన్నపేట మీదుగా బచ్చన్నపేట వెళ్లే దారిలో కల్వర్టులు, కాలువల సమీపంలో బ్రిడ్జిల ని ర్మాణం లేకపోవడంతో వరదలతో దాటలేని పరిస్థితి ఉంది.
రాకపోకలు బంద్
చిల్పూరు: భారీ వర్షాలు కురిస్తే చిల్పూరు గుట్ట నుంచి మండల కేంద్రం బర్రెంకల చెరువు మత్తడి, వెంకటాద్రిపేట నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్డు మధ్యలో చిల్పూర్ వాగు ఉప్పొంగితే రాకపోకలు నిలిచి పోతాయి. పల్లగుట్టకు వెళ్లే రూట్‌లో మూడు రూట్లలో లోలెవెల్ కల్వర్టులు ఉన్నాయి.
స్తంభించిపోతున్న రాకపోకలు, రవాణా
లో లెవల్ బ్రిడ్జి, మత్తళ్ల కల్వర్టులపై
చిన్నచూపు
తాత్కాలిక మరమ్మతులకే పరిమితం
కామారెడ్డి వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ప్రజలు

అలుగు పడితే ఆగుడే

అలుగు పడితే ఆగుడే

అలుగు పడితే ఆగుడే

అలుగు పడితే ఆగుడే