
రఘునాథపల్లి: ద్విచక్రవాహనం, గ్యాస్ సిలిండర్ దొంగలించిన కేసులో నిందితుడికి కోర్టు ఏడాది జైలు, జరిమానా విధించినట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ గురువారం తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఎస్‌కే ఖయ్యూం గత నెల 7వ తేదీన మండలంలోని కంచనపల్లిలో ఆమనగంటి రాజశేఖర్‌కు చెందిన గ్యాస్ సిలిండర్, గోవర్దనగిరిలో ద్విచక్రవాహనం దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి నిందితుడికి ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. అలాగే 21 మే 2018న మండలంలోని నిడిగొండ వద్ద అతి వేగంగా కారు నడిపి మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణానికి కారకుడైన హైదరాబాద్‌కు చెందిన ఎండీ ఖమ్యూం అలియాస్ లోబో అనే నిందితుడికి ఏడాది జైలు, రూ.12,500 జరిమానా విదించినట్లు ఎస్సై తెలిపారు.