
ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా రెండో స్థానం
● ప్రభుత్వం నుంచి ప్రశంసపత్రం
అందజేత
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మొదటి విడతలో 71శాతం, రెండో విడతలో 86 శాతం గ్రౌం డింగ్ పూర్తి అయినందున ఈ నెలలో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా రెండో స్థానం దక్కించుకుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసపత్రం, ల్యాప్‌టాప్‌ను గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో హౌజింగ్ పీడీ మాతృ నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం మొదటి విడతలో 716ఇల్లు మంజూరు కాగా 479 గ్రౌండింగ్ అయ్యాయని, రెండో విడతలో 5,282 ఇల్లు మంజూరు కాగా, 4,341 గ్రౌండింగ్ దశలో ఉన్నాయన్నారు.
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
లింగాలఘణపురం: జనగామ పట్టణానికి సంబంధించిన గణనాథుల నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లుట్ల చెరువును అన్ని శాఖల అధికారులతో కలిసి పరి శీలించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, జిల్లా పంచాయతీ అధి కారి స్వరూప, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సుధీర్, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ అశోక్, మత్స్యశాఖ అధి కారి రాణాప్రతాప్, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ ఉన్నారు.
రేపు జాబ్‌మేళా
జనగామ రూరల్: ఈనెల 30వ తేదీన జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో 80 పోస్టులకుగాను జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్ లోని ఎస్.8.లో ఉదయం 10:30 గంటలకు హాజ రుకావాలని సూచించారు. వివరాలకు 79954 30401 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించాలన్నారు.