
సోమేశ్వరాలయంలో హుస్సేన్‌నాయక్ పూజలు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ ఆది వారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హూస్సేన్‌నాయక్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదం అందజేశారు.
గోశాలల అభివృద్ధికి కృషి
గోశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హుస్సేన్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీగౌరి గోషాలను పరిశీలించారు. గోశాల నిర్వహణను ప్రోత్సహిస్తామని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్, మత్తగజం నాగరాజు, బీజేపీ నాయకులు దొంగరి మహేందర్, మారం రవికుమార్, కమ్మగాని శ్రీకాంత్, సంపత్ పాల్గొన్నారు.