సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు

Aug 18 2025 6:25 AM | Updated on Aug 18 2025 6:25 AM

సాక్ష

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు

హన్మకొండ కల్చరల్‌/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్‌కు చెందిన సాక్షి సీని యర్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పెద్దపల్లి వరప్రసాద్‌, జనగామ ఫొటోగ్రాఫర్‌ గోవర్ధనం వేణుగోపా ల్‌ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.

గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి

జనగామ రూరల్‌ : గణపతి నవరాత్రుల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా చేయాలని గణేష్‌ ఉత్సవ సమితి కమిటీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్‌, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా నాయకులు రంగ నర్సింగరావు కోరారు. ఆదివారం స్థానిక నెల్లుట్ల చెరువును వారు సందర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా చూడాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు

జనగామ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో జిల్లా వ్యాప్తంగా ముసురు వాన కురుస్తోంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 వరకు జిల్లాలో సరాసరి 12.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వివిధ మండలాల పరిధిలో ఉదయం నుంచి విడతలవారీగా కురుస్తున్న వర్షం.. పట్టణంలో రాత్రి ముసురుతో మొదలైంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ లొకేషన్‌ పరిధిలో 48 మిల్లీ మీటర్లు కురియగా, నర్మెటలో 42.5 మి.మీ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 33.0 మి.మీ, జఫర్‌గఢ్‌లో 27.3 మి.మీ, తరిగొప్పుల మండలం అబ్దుల్‌ నాగారం లొకేషన్‌లో 16.0 మి.మీ, కొడకండ్లలో 10.3 మి.మీ, పాలకుర్తి మండలం గైడూరు లొకేషన్‌లో 8.0మి.మీ, దేవరుప్పులలో 4.3 మి.మీ, జనగామలో 4.0 మి.మీ, లింగాలఘనపురంలో 3.5 మి.మీ, రఘునాథపల్లిలో 1.8 మి.మీ, బచ్చన్నపేటలో 1.8 మిల్లీ మీటర్ల మేర కురియగా.. రాత్రి 10 గంటల తర్వాత కొంత మేర పెరిగింది.

రామప్ప శిల్పకళ మరుపురానిది..

వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ సామ్‌ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్‌రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి జస్టిస్‌ శ్రీనివాస్‌రావుకు గైడ్‌ విజయ్‌కుమార్‌, జస్టిస్‌ సామ్‌ కోషికి గైడ్‌ వెంకటేశ్‌లు వివరించారు. ఈ సందర్భంగా వారు శిల్పకళ సంపద బాగుందని వివరించారు. వారి వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జడ్జి దిలీప్‌కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్‌, సీఐ సురేష్‌, ఎస్సై చల్ల రాజు ఉన్నారు.

బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు అందాలి

న్యూశాయంపేట: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ ముస్లింలకు రిజర్వేషన్‌ ఫలాలు అందాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో బీసీ ముస్లిం ఏ, బీ, ఈ గ్రూప్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ రాజ్‌మహ్మద్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వరంగల్‌ నుంచి హక్కుల సాధన కోసం బీసీ ముస్లింల ఓ అడుగు ముందుకు పడడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం చైర్మన్‌ చిరంజీవులు ఫోన్‌లో తమ మద్దతు తెలిపారు.

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు1
1/2

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు2
2/2

సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement