
భక్తులతో పోటెత్తిన సోమేశ్వరాలయం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు.
23 నుంచి క్రీడాపోటీలు
జనగామ: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పురుషులు, మహిళలకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 23న పురుషులకు వాలీబాల్, 24న మహిళలకు త్రో బాల్ పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్ పోటీలకు14 సంవత్సరాల పైబడి, ఒకే గ్రామానికి చెందిన వారు ఉండాలన్నారు. త్రోబాల్‌లో 13 నుంచి 21 సంవత్సరాల లోపు ముగ్గురు, 21 సంవత్సరాల పైబడి మిగతా వారు ఉండాలన్నారు. విజేతలకు నగదు పురస్కారం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8099724409, 9849298108 నంబర్లను సంప్రదించాలన్నారు.
22వ తేదీ నుంచి సదరం
స్లాట్ బుకింగ్
జనగామ రూరల్: సదరం యూడీఐడీ క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగులు ఈ నెల 22 నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 22 నుంచి 29వ తేదీ వరకు లెప్రసీ, యూసిడ్ బాధితులు, వినికిడి లోపం, కంటి చూపు కోల్పోయిన వారు, తలసేమియా, నరాల బలహీనత తదితర రుగ్మతలతో బాధ పడుతున్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8008202287 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎ న్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తడిబట్టలు, చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్‌లను తాకవద్దని, వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాలను ముట్టుకోవద్దని సూచించారు. ఇళ్లలో బట్టలు ఆరవేసే సమయంలో ఐరన్ వైర్‌కు బదులుగా ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే మేలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ తీగలు తెగి పడినట్లు గమనిస్తే వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ పొలాలు, ఇంట్లో వినియోగదారులు, రైతులు సొంతంగా కరెంటు పనులు చేసుకోవద్దని, అర్హత కలిగిన వారితో మాత్రమే మరమ్మతు చేయించాలన్నారు.
కురుమలు ‘స్థానికం’లో సత్తాచాటాలి
రఘునాథపల్లి: కురుమ కులస్తులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని కురుమ సంఘం కార్యాలయంలో పేర్ని రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాల నేపధ్యంలో గొర్రెల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్, నాయకులు గొరిగ రవి, గుండా వెంకటయ్య, మల్లేష్, యాకయ్య, మహేందర్, సోమయ్య, శ్రీశైలం, భద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
28న దివ్యాంగుల గుర్తింపు
జనగామ: సమగ్ర శిక్ష జనగామ ఆధ్వర్యంలో ఈనెల 28న దివ్యాంగుల గుర్తింపుతో పాటు ప్రత్యేక అవసరాలకు అవసరమయ్యే పరికరాల పంపిణీకి క్యాంపు నిర్వహించబడుతుందని డీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 18 సంవత్సరాలలోపు వయస్సు గల ది వ్యాంగులు తమ ఆధార్, యూడీఐడీ, రేషన్ కా ర్డు, సదరం సర్టిఫికెట్, రెండు ఫొటోలతో క్యాంపునకు హాజరుకావాలన్నారు. క్యాంపు నిర్వహించే స్థలం త్వరలో తెలియజేస్తామన్నారు.

భక్తులతో పోటెత్తిన సోమేశ్వరాలయం