
ఎరువుల కొరత సృష్టించొద్దు
బచ్చన్నపేట: ఎరువుల కొరత సృష్టించొద్దని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆగ్రోస్ ఎరువుల దుకాణాన్ని, పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు అందించాలన్నారు. స్టాక్ బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదులు వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్