
సమస్యల పరిష్కారమేది?
గ్రీవెన్స్‌లో బాధితుల మొర
జనగామ రూరల్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షమెప్పుడోనని బాధితులు వాపోతున్నా రు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతా ల నుంచి బాధితులు వినతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్‌బాషా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, ఉన్నతాధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చి న వినతులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 34 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
వినతులు కొన్ని ఇలా..
● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన యాసారపు రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు.
● చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన దారా ఝాన్సీ డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● దేవరుప్పుల మండలం రామచంద్రాపురం గ్రామంలో 2022–23 సంవత్సరంలో నిర్మించిన డ్రెయినేజీ నాసిరకం పనులతో నిర్మించారని, నాణ్యతప్రమాణాలు పరిశీలించి చర్య తీసుకోవాలని సుధాకర్‌రెడ్డి, ఇన్నారెడ్డి, రమేశ్, ఆంజనేయులు ఫిర్యాదు చేశారు.
● జనగామ, పాలకుర్తి రహదారిలోని పటేల్ గూడెం వాగు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర వీరస్వామి కలెక్టర్‌కు వినతి అందించారు.
● నీర్మాల గ్రామానికి చెందిన మేడ కల్పనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వినతి అందించింది.
వినతులు తక్షణమే పరిష్కరించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
ప్రజావాణికి 34 అర్జీలు