
పాపన్న పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నాం..
రఘునాథపల్లి: బహుజన వీరుడు సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఖిలాషాపూర్‌లో గౌడ సంఘం నాయకులు గడ్డమీది వెంకన్న అధ్యక్షతన జరిగిన పాపన్న జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. గోల్కొండ కోటపై జెండా ఎగుర వేసిన బహుజనుల పోరాట యో ధుడు పాపన్న అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాపన్న జయంత్రి వేడుకలు అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌లో పాపన్న విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారన్నారు. అంతకుముందు బస్టాండ్ వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బొల్లం అజయ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, ముప్పిడి శ్రీధర్, కోళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు.
పాపన్న ఆశయాలను భావితరాలకు
తెలియజేయాలి
జనగామ రూరల్: సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌లో పాపన్న జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాపన్న చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్, ఎకై ్సజ్ శాఖ అధికారి అనిత, బీసీ కుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి