
ఇక్కడ ఇలా.. అక్కడ అలా!
వానమ్మా..ఎక్కడమ్మా?
జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో)
జనగామ: కరువు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జనగామ జిల్లాపై వరణుడు అలక బూనినట్టు కనిపిస్తున్నాడు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినా.. మోస్తరు కురిసింది. గడచిన ఐదు రోజుల్లో ఒక్క భారీ వర్షం కురియలేదు. రెడ్ అలర్ట్ జారీ చేయగా, వరణుడు తుస్సు మనిపించగా, ఆరెంజ్ అలర్ట్‌గా ప్రకటించినా.. వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేశాడు. చివరకు ఎల్లో అలర్ట్ జాబితాకు వచ్చినా మోస్తరు వాన నమోదు కాలేదు. రాష్ట్రం నలుమూలలా వర్షాలు కురుస్తున్నప్పటికీ, జిల్లాలో ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఇందులో జనగామ నియోజకవర్గంలో మరీ దారుణంగా మారింది.
జిల్లాలో 955 చెరువులు.. 248 చోట్ల మత్తళ్లు
జిల్లాలో 955 చెరువులు ఉన్నాయి. ఇందులో 159 చోట్ల 25 శాతం నిండగా, 261 చెరువుల్లో 50 శాతం, 143 చోట్ల 75 శాతం, 230 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరద నీరు చేరుకోగా, 160 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. అల్పపీడన ప్రభావం, రుతు పవనాల ఎఫెక్టు కలిసినా జనగామ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో నేటికి బోరుబావులు గ్యాబ్ ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో 249 చెరువులు ఉండగా, 113 చోట్ల 25 శాతం మాత్రమే నీటి శాతం ఉన్నట్లు లెక్కించారు. ఇందులో కొన్ని చోట్ల జీరో శాతం ఉండడం ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఈ మండలాల పరిధిలో కేవలం 15 చెరువులు మాత్రమే మత్తళ్లు పోస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో 314 చెరువులకు గాను 14 చోట్ల 25 శాతం నీరు మాత్రమే ఉండగా, 73 చెరువులు మత్తడి పోస్తున్నాయి. 137 గ్రామాల్లో 75 నుంచి 100 శాతం వరకు నిండాయి. పాలకుర్తి నియోజకవర్గంలో 392 చెరువులకు గాను 69 చోట్ల మత్తడి పోస్తుండగా, ఒక చెరువులో 25 శాతం మాత్రమే నీటి జాడలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. 364 చెరువులు మాత్రం 75 నుంచి 100 శాతం వరకు నిండాయి. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, జనగామలో మాత్రం ఇంకా కరువు ఛాయలు పోలేదని చెప్పుకోవచ్చు. జిల్లాలో అత్యధికంగా రఘునాథపల్లిలో 26, చిల్పూరులో 16, జఫర్‌గఢ్‌లో 13, నర్మెటలో 7 చెరువులు 100 శాతం నిండగా, జనగామ, బచ్చన్నపేట, తరిగొ ప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల ప్రాంతాల్లో అతి తక్కువ చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఇదిలా ఉండగా గండిరామారం రిజర్వాయర్‌లో నీటి మ ట్టం తగ్గుముఖం పట్టగా, కన్నెబోయినగూడెం ప్రా జెక్టులో జీరో పర్సంటేజ్ కూడా పెరగలేదు.
రాష్ట్రమంతటా విస్తారంగా కురుస్తున్నా..
జిల్లాలో అంతంతే!
పెరగని భూగర్భ జలాలు
భారీ వర్షాలు కురుస్తేనే
మేలంటున్న అన్నదాతలు
జిల్లాలో 248 చెరువులే మత్తళ్లు
తేదీ వర్షపాతం
నమోదు
12 16.2
13 0.4
14 11.6
15 13.7
16 9.2
17 33.0
18 1.1

ఇక్కడ ఇలా.. అక్కడ అలా!