
డీఈఈసెట్–25 స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025–27 విద్యాసంవత్సరానికి డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) రెండేళ్ల కోర్సు కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేట్) వారీగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశిఽక్షణా సంస్థ ప్రధానాచార్యుడు డాక్టర్ ఎండీ అబ్దుల్‌హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ డీఈఈ సెట్–2025లో అర్హత సాధించి ఉండాలని, ఏ కళాశాలలోనూ (ప్రభుత్వ, ప్రైవేట్) సీటు పొందలేదని రిపోర్ట్, జాయిన్ కాని అభ్యర్థులు మాత్రమే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వరంగల్, హనుమకొండలో విద్యాశిక్షణ సంస్థలో ఖాళీ సీట్లలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఈనెల 19న హాజరు కావాలని, ఈనెల 21న సీటు పొందిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ డైట్ కళాశాలల్లో ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాల్సి ఉంటుందని, సీటు పొందినవారు ఈనెల 21న కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీఎస్//డీఈఈసెట్,సీడీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.