ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
జనగామ: కలెక్టరేట్ ఆవరణలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్‌నితిన్‌తో కలిసి ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రముఖులు, మీడియా, అతిథుల కోసం ఏర్పాటు చేసే గ్యాలరీ ప్రాంతాన్ని సందర్శించి.. వేదిక, అలంకరణ, సౌండ్ సిస్టం, తాగునీటి సదుపాయంపై అధికారులకు సూచనలు చేశారు. పోలీసుల గౌరవ వందనం, బందోబస్తుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, ఉద్యానవన అధికారి శ్రీధర్‌రావు, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పిల్లలకు ఉచిత స్వర్ణ ప్రాశన
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ, వెల్నెస్ సెంటర్‌లో శనివారం ఉచిత స్వర్ణ ప్రాశన కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. స్వర్ణ ప్రాశన తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక, మేధాశక్తి, ఎముకల పటిష్టత, జీర్ణశక్తి పెరుగుతుందన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా


