విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి●
జనగామ రూరల్: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా గుణాత్మక విద్య అందించాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. శనివారం ధర్మకంచ బాలుర ఉన్నత పాఠశాలలో కోర్సు డైరెక్టర్, ఎంఈ ఓ గురిజాల శంకర్‌రెడ్డి ఆధ్వర్యాన చేపట్టిన ఇన్ సర్వీస్ టీచర్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య తదితరాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల నమోదు పెంచాలన్నా రు. కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లిష్, గణిత, పరిసరాల విజ్ఞానం ఆర్పీలు పరశురామన్, బొగ్గారపు శ్రీనివాస్, నిమ్మ రామ్‌రెడ్డి, రేణిగుంట్ల మురళి, చట్ల సాంబరాజు, వంగ సంతోష్‌కుమార్, శాడ రవి, నవీన్ కుమార్, సీఆర్పీలు రమేశ్, నరేష్ పాల్గొన్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమం అనంతరం డీఈఓ భోజన్నను తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యాన సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు కాకాని లక్ష్మణమూర్తి, ప్రధాన కార్యదర్శి మేడ మనోజ్‌కుమార్, కోశాధి కారి బెజ్జం సునీల్‌కుమార్, అంజయ్య, శేషుకుమార్, రజిత, కుమారి, బలరాం పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి భోజన్న


