ముగిసిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు
జనగామ: విద్యుత్ ప్రమాదాల నివారణకు జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన భద్రతా వారోత్సవాలు ముగిశాయని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీఎండీ వ రుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ఊరూరా భద్రతా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. టోల్ ఫ్రీ 1912, వాట్సాప్ నంబర్ 7901628348 ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ రేటు సాధించామన్నారు. ఉద్యోగుల భద్రతకు సేఫ్టీ బెల్ట్, గ్లోవ్స్, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్, హెల్మెట్‌లను అందించినట్లు చెప్పారు. అవగాహన సదస్సులతో ప్రమాదాలను తగ్గించగలిగామన్నారు. ఎస్‌ఈ వెంట జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డీఈలు లక్ష్మీ నారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్ ఇంజనీర్ గణేష్, ఎంఆర్‌టీ డివిజనల్ ఇంజనీర్ విజయ్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జయరాజు తదితరులు ఉన్నారు.


