సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

Jan 3 2026 7:20 AM | Updated on Jan 3 2026 7:20 AM

సీఎంన

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ‘మోడల్‌’ విద్యార్థులు ఆంగ్ల ఉపాధ్యాయుడు గణేశ్‌కు విద్యారత్న అవార్డు

జనగామ: నూతన సంవత్సరం పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలపై వారికి వివరించారు.

జఫర్‌గఢ్‌ : మండల కేంద్రంలోని మోడల్‌ స్కూ ల్‌కు చెందిన టి.విజయ్‌, టి.చరణ్‌, సాయితేజ అనే ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ కె. శ్రీకాంత్‌ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీస్టేడియంలో జరిగిన కంట్రీ అథ్లెటిక్స్‌ సెలక్షన్‌ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు పీఈటీలు బి.రాజు, శ్రీనాథ్‌లను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

రఘునాథపల్లి: మండలంలోని వెల్ది ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేశ్‌ను విద్యారత్న అవార్డు వరించింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన గణేశ్‌ మూడు దశాబ్దాలుగా ఆంగ్ల విద్యా బోధన చేస్తూ విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషిని గుర్తించి ఉత్తరప్రదేశ్‌లోని విజన్‌ వెల్‌నెస్‌ ఫౌండేషన్‌ అవార్డు, ప్రశంసపత్రం పంపించింది. శుక్రవారం ప్రిన్సిపాల్‌ పాలకుర్తి శ్రీధర్‌ పాఠశాలలో గణేశ్‌కు అవార్డు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గణేశ్‌ మాట్లాడుతూ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు.

‘పింగిళి’లో కథా సర్టిఫికెట్‌ కోర్సు షురూ

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్‌ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ ప్రెస్‌ బ్యూరో డైరెక్టర్‌ కోటేశ్వర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్‌.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి1
1/3

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి2
2/3

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి3
3/3

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement