వృద్ధరైతులకు ఆర్థిక భరోసా
పాలకుర్తి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కలుగనుంది. 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భద్రతను కల్పించాలాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులకు ప్రత్యేకంగా పెన్షన్‌ను అందించాలనేది ఈ పథకం ముఖ్యఉద్దేశం.
అర్హులెవరంటే..
ఐదెకరాల వ్యవసాయ భూమి కలిగి ఉండి 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న రైతులు ఈ పథకానికి అర్హులు. భూ రికార్డుల్లో వారిపేరు ఉండాలి. నిర్ణీత ప్రీమియం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, సామాజిక భద్రత పథకాలను అందుకుంటున్న వారు అనర్హులు.
దరఖాస్తు చేసుకోండిలా..
అర్హులైన రైతులు తమకు దగ్గరలోని సీఎస్‌సీ కేంద్రాలు, సీఎం కిసాన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ నెంబర్, నామినీ, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయగానే పెన్షన్ కార్డు జారీ అవుతుంది. ప్రతి నెల ప్రీమియం ఖాతా నుంచి నేరుగా డెబిట్ అవుతుంది. వయసు ఆధారంగా ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. 60ఏళ్లు నిండగానే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. ఒకవేళ రైతు చనిపోతే నామినికి నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందుతుంది.
కిసాన్ మానధన్ యోజనతో మేలు


