‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
జనగామ రూరల్: మహిళల ఆర్థిక ప్రగతికి ఇందిరా మహిళా శక్తి ఎంతో దోహదపడుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా సీ్త్ర నిధి నుంచి పొందిన రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రూ.1.25లక్షల పెట్టుబడితో వారాహి మహిళా పొదుపు సంఘం సభ్యురాలిచే వనిత టీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్షవర్ధన్, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.
యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన డ్రైవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించి శిక్షణ పూర్తయిన అనంతరం 100 శాతం ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జ రుగుతుందన్నారు. శిక్షణ సందర్భంగా స్కిల్ ఇండి యా సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. కాగా ఈ డ్రైవ్‌లో 40 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, ఏపీడీ నూరో ద్దిన్, మౌనిక, లాజిస్టిక్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అండర్ స్కిల్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


