మంచుకురిసే.. మనసు మురిసే
పాలకుర్తి శ్రీసోమేశ్వరాలయం ముందు కమ్ముకున్న పొగమంచు
జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 11 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో వరంగల్–హైదరాబాద్, విజయవాడ–దుద్దెడ ప్రధాన హైవేలతో పాటు నర్మెట, కళ్లెం తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారుల మంచులో దిగ్బంధమైపోయాయి. వాహనదారులు ఫ్లడ్‌లైట్ల వెలుతురుతోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు మంచు తెరలను చీల్చుకుని పొలాలకు వెళ్లారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు పొగమంచుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. కాగా, రోడ్లపై వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
–జనగామ/
స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తి టౌన్
స్టేషన్ ఘన్‌పూర్ వివేకానంద చౌరస్తా వద్ద పొగమంచు
మంచుకురిసే.. మనసు మురిసే
మంచుకురిసే.. మనసు మురిసే
మంచుకురిసే.. మనసు మురిసే


