
నిబంధనలు తూచ్..
‘ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేదు.. మేము నిర్ణయించిన ప్రకారమే కొనుగోలు చేస్తాం.. ధాన్యం లిఫ్టు అయ్యే వరకు గన్నీ బ్యాగులు ఇచ్చుడు లేదు’.. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ నిర్వాహకుల తీరుతో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.
తేమ 17 శాతం వచ్చినా కొంటలేరు..
మద్దతు ధరకు అమ్ముకునేందుకు నాలుగు రోజుల కింద 200 బస్తాల వడ్లు ఇక్కడికి తెచ్చినం. నిలువ నీడ లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. ధాన్యంలో 17 శాతం తేమ వచ్చినా కొంట లేరు. సెంటర్ నిర్వాహకులు పొద్దున కాకుండా సాయంత్రం చూసి తేమ ఎక్కువ ఉందని అంటున్నారు.
జనగామ: యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ శాఖలకు చెందిన దొడ్డు, సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 276 ఏర్పాటు చేశా రు. పట్టణ పరిధి, జనగామ మండలంలోని రైతుల సౌకర్యార్థం వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో చీటకోడూరు ఐకేపీ సెంటర్ ప్రారంభించారు. అయితే లింగాలఘణపురం, రఘునాథపల్లి తదితర మండలాల నుంచి కూడా రైతులు ఇక్కడికి ధాన్యం తీసుకువస్తున్నారు. దీంతో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాటన్ యార్డులో 25వేల బస్తాలకు పైగా ధాన్యం నిల్వలు పేరుకు పోయాయి. కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఐదు నుంచి 15 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు.
తేమ 17 శాతం ఉన్నా కొనుగోళ్లలో జాప్యం..!
ప్రభుత్వం 17 శాతం తేమ ఉన్న ధాన్యం క్వింటాకు రూ.2,320 చొప్పున కొనుగోలు చేసేలా నిబంధనలు విధించింది. ఈ సెంటర్‌లో మాత్రం 16 శాతం తేమ ఉండాల్సిదేనని షరతులు పెడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే అట్లయితెనే కొంటాం అంటూ బుకాయించడంతో రెండు రోజుల క్రితం నిర్వాహకులను నిలదీయడంతో.. సమస్య పైఅధి కారుల వరకు వెళ్లింది. అయినా వారి తీరు మారకపోవడంతో రోజుల తరబడి రైతులు ధాన్యం ఆరబోసుకుంటూ నిరీక్షిస్తున్నారు. ‘17 శాతం తేమ వచ్చినా కొనుగోలు చేయడంలేదు.. ఒక వేళ కొనుగోలు చేసినా.. నిల్వ ఉన్న బస్తాలు రైస్ మిల్లులకు తరలించే వరకు గన్నీ బ్యాగులు ఇవ్వడంలేదు’ అని పలువురు రైతులు వాపోయారు. ఇప్పటి వరకు ఈ సెంటర్‌లో 2,818 మంది రైతుల నుంచి 37,821 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. 36,421 బ్యాగుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారు.
– ఎలబోయిన సమ్మక్క,
మహిళా రైతు, చీటకోడూరు(జనగామ)
15 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం..
మద్దతు ధరకు అమ్ముకోవడానికి 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి 460 బస్తాల ధాన్యం తెచ్చాం. తేమ 16 శాతం ఉంటేనే కొంటామని నిర్వాహకులు మెలిక పెట్టారు. దీంతో చాలాసార్లు ఆరబోయగా తేమ 17 శాతం వచ్చింది. బైక్ పెట్రోలు, భోజనం, ఆరబోసేందుకు కూలీల ఖర్చు రోజుకు రూ.500 అవుతోంది. శుక్రవారం కొంటామని చెప్పిన నిర్వాహకులు.. ముందు కొన్న ధాన్యం లిఫ్టు అయ్యేవరకు గన్నీ బ్యాగులు ఇవ్వమన్నారు.
– బండారు తిరుపతి, రైతు, చీటకోడూరు
తేమ 17 కాదు.. 16 శాతం ఉంటేనే కొంటాం
ఉన్న స్టాక్ తరలించాకే
గన్నీ బ్యాగులిస్తామని మెలిక
ఐకేపీ ధాన్యం సేకరణ కేంద్రంలో
నిర్వాహకుల ఇష్టారాజ్యం
రోజుల తరబడి రైతులకు తప్పని నిరీక్షణ

నిబంధనలు తూచ్..

నిబంధనలు తూచ్..