లక్ష్యాన్ని ఛేదించాలి..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు తీసుకురావాలి. ప్రజల ద్వారా వచ్చే నోటుపుస్తకాలు తదితర మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – జనగామ
యువత లక్ష్యం వైపు గురి పెట్టాలి. రాష్ట్రంలో త్వరలో పోలీస్ కానిస్టేబుల్, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని ఇప్పటినుంచే నిరంతరం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సృష్టించుకోవాలి. మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించేలా ఎదగాలి. ఏఐ వచ్చాక ఉద్యోగాల తీరు మారిపోయింది.ఇలాంటి సమయంలో ఉద్యోగాలు ఎవరివ్వాలి. అలా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి.
వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికీ ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి నిండిన సంవత్సరంగా మారాలి. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. – జనగామ
లక్ష్యాన్ని ఛేదించాలి..


