సోమన్న ఆలయ వేలంపాటల ఆదాయం రూ.26లక్షలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరంలో కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, దేవస్థానానికి వాహనం పూజా సామగ్రి సప్లై చేయు లైసెన్స్ కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.26,20,000ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆలయం కళ్యాణ మండపంలో వేలం పాట నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నెమురుగొమ్ముల శ్రీనివాస్‌రావు రూ.26,20,000లు పాట పాడి కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకునే హక్కు దక్కించుకున్నారు. సరైన పాట రాకపోవడంతో తలనీలాల వేలం వాయిదా వేసినట్ల ఈఓ తెలిపారు. అలాగే ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండి బకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను జప్తు చేసినట్లు ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు.


