
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరాలయంలో శుక్ర(లక్ష్మి) వారాన్ని పురస్కరించుకుని భూనీల సమేత స్వామివారిని అర్చకులు పుష్ప, తులసీ దళాలతో అలంకరించారు. అంతకు ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రస న్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు.
శ్రీసోమేశ్వరుడికి న్యాయమూర్తి పూజలు
పాలకుర్తి టౌన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి హైకోర్టు రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన డి.రవీంద్రశర్మ కుటుంబ సభ్యులు శుక్రవారం శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆల య ఈఓ మోహన్‌బాబు, అర్చకులు డీవీఆర్. శర్మ, దేవగిరి అనిల్‌శర్మ, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు బీఎస్‌ఎన్‌ఎల్
కస్టమర్ సర్వీస్ క్యాంప్
జనగామ రూరల్: జిల్లా పరిధిలోని వినియోగదారులకు జనగామ టెలిఫోన్ ఎక్చేంజ్ పరిధి లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టమర్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజినల్ ఇంజినీర్ చంద్రగిరి ప్రసాద్ తెలిపారు. ఈ క్యాంపులో సంస్థకు సంబంధించి వివిధ సర్వీసులు, మొబైల్, ఇంట ర్నెట్, వైఫై, సిగ్నల్ సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంప్‌లో వరంగల్ ఏజీఏం దయాకర్‌తో పాటు ఎస్‌డీఈలు శ్రీహరి, రాంప్రసాద్, షఫీక్ పాల్గొంటారని వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయం
జనగామ: ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ఎన్పీడీసీఎల్ పాటుపడుతోందని ఎస్‌ఈ వేణుమాధవ్ అన్నారు. శుక్రవారం జనగామ డివిజనల్ కార్యాలయంలో జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఆధ్వర్యాన మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 200 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి యాజ మాన్యం, డాక్టర్లను డీఈలు గణేష్, లక్ష్మీనారా యణ, వై.రాంబాబు, ఏడీఈ పి.రణధీర్‌రెడ్డి, ఏఈ పి.శంకర్‌తో కలిసి ఎస్‌ఈ సత్కరించారు.

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ