జనగామ రూరల్: జనగామ బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ, పోటీదారుల తుది జాబితా ను ఎన్నికల అధికారి శ్రీరాం శ్రీనివాస్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి హరిప్రసాద్ యాదవ్, కూరెళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బి.దయాకర్‌రెడ్డి నామినేషన్లు వేయగా.. శ్రీనివాస్ రెడ్డి, దయాకర్‌రెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో దండేబోయిన హరిప్రసాద్‌యాదవ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందని ఎన్నికల అధికారి శ్రీరాం శ్రీనివాస్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జి.రాజశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉపాధ్య క్ష పదవికి ఇర్రి అశోక్, స్పోర్ట్స్–సాంస్కృతిక కార్యదర్శిగా రెడ్డబోయిన రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ఎన్నిక అనివార్యమైనందున ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.