రెండోపంటకు సాగునీరు
జనగామ రూరల్: జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని, ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోకూడదని, అలాగే రోడ్డు భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగవారం కలెక్టరేట్‌లో నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి 163 డిజైన్ గాని, నిర్మాణం గాని భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి
ప్రతీ గర్భిణి, శిశువు ఆరోగ్యంపై వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. కలెక్టరేట్‌లో మాతృ మరణాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయం మేలు..
రఘునాథపల్లి: ౖసేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాస్త్రవేత్తలకు సూచించారు. మండలంలోని నిడిగొండలో జయశంకర్ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఙాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ శ్రీలత, విస్తరణ సంచాలకులు యాకాద్రి, సర్పంచ్ వీరస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ బాషా


