చర్చీల్లో క్రిస్మస్ కాంతులు
జనగామ: జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లా వ్యాప్తంగా క్రీస్తు ఆరాధన మందిరాలు విద్యుత్తు దీపాల కాంతులతో ఆకట్టుకుంటున్నాయి. ఇళ్ల ముందు నక్షత్రాల వెలుగులు విరజిమ్ముతుండగా, ఇళ్ల లోపల క్రిస్మస్ ట్రీలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటికే జనగామ, దేవరుప్పుల, చిల్పూరు, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల తదితర మండలాల్లోని చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, నృత్య కార్యక్రమాలతో సంబురాలు ప్రారంభించారు.


