ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
జఫర్‌గఢ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన సభకు పాఠశాల హెచ్‌ఎం సదానందం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్‌సీ అందేలా పాటుపడుతానన్నారు. తిడుగు పాఠశాల అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో లక్షలు, కోట్లు ఖర్చు చేసి సర్పంచ్‌లు ఎన్నిక కావుతుండగా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపు సోమయ్య డబ్బులు ఖర్చు చేయకుండా ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డితో పాటు నూతన సర్పంచ్‌గా ఎన్నికై న గోపు సోమయ్యను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుందూరు సుధాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రామారావుతో పాటు సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


