చిన్నారి ‘అన్నదాతలు’
జనగామ: కిసాన్ దివస్‌ను పురస్కరించుకుని ఎస్‌పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మంగళవారం ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో రైతుల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించగా, రైతు వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ విపల్ శ్రీపతిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రైతుల శ్రమను గౌరవించాలని, ఆ భావన చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందాలని సూచించారు. పిల్లల ప్రతిభను ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు శోభ, అరుణ్, సాయిరామ్, శరత్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఎస్‌పీఆర్ స్కూల్‌లో కిసాన్ దివస్ వేడుకల్లో రైతుల వేషధారణలో చిన్నారులు


