ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. | - | Sakshi
Sakshi News home page

ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా..

Sep 18 2023 1:46 AM | Updated on Sep 19 2023 8:30 AM

- - Sakshi

జనగాం: టికెట్‌ రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జమిలి ఎన్నికలు వస్తే అభ్యర్థుల మార్పు తప్పనిసరిగా ఉంటుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి నుంచి వీరారెడ్డి తండాకు బీటీ రోడ్డు, గబ్బెటలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అశ్వరావుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22 వరకు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని, జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లు పేర్కొన్నారు.

‘అటుది ఇటు అయితది.. ఎటైనా అయితది.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నాకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.. నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉండాలి.. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు. సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు బొల్లం అజయ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కుమార్‌గౌడ్‌, వారాల రమేష్‌, ఎంపీటీసీలు సుల్తాన్‌ దెవేందర్‌రెడ్డి, శాగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement