జగిత్యాల: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2026–27, ఇన్‌స్పైర్ అవార్డ్స్ 2025–26, డీఎల్‌ఈపీసీ, పీఎంశ్రీ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత, ప్రాథమిక, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలకు వేదికై న జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఈనెల 19న ప్రారంభించి 21వరకు నిర్వహించనున్నారు.
ప్రధాన అంశం: సుస్థిర, వికాసిత్ భారత్ కోసం సైన్స్ టెక్నాలజీ, ఇన్నోవేషన్
ఉప అంశాలు: మెరుగైన జీవితం కోసం కృత్రిమ మేథస్సు, హరిత శక్తి, పర్యావరణ పరిరక్షణ, గణిత మోడలింగ్ కంప్యూటర్ థింకింగ్, ఆరోగ్యం, పరిశుభ్రత, శానిటేషన్, స్వదేశీ వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పరివర్తన కోసం సైన్స్ విపత్తు నిర్వహణతోపాటు విద్యార్థులు ప్రధాన వస్తువు కింద వచ్చే ఇతర నూతన అంశాలపైనా నమూనాలు ప్రదర్శించే అవకాశం ఉంది. పాఠశాలలు జిల్లాస్థాయి ఎంపిక కోసం మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ఏడు ప్రదర్శనలు, ప్రతి ఉప అంశం నుంచి ఒకటి చొప్పున ఉండాలి. ఈ ప్రదర్శనలతోపాటు, ఏడుగురు విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుడు హాజరు కావాలి. సైన్స్ ప్రదర్శనలో భాగంగా విద్యార్థుల కోసం ఒకరోజు సెమినార్ నిర్వహించనున్నారు. వాతావరణ మార్పుల కోసం అసంక్రమణ వ్యాధులు, కారణాలు, నివారణ చర్యలపై సెమినార్ ఉంటుంది. ఇందులో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ప్రాతి నిధ్యం వహిస్తారు. జిల్లాస్థాయిలో విజేతలుగా ని లి చిన వారు రాష్ట్ర ప్రదర్శనకు అర్హత సాధిస్తారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిస్తే జాతీయస్థాయి, 2027 దక్షిణ భారతదేశ సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికవుతారు.
డీఎల్‌ఈపీసీ
2025 విద్యా సంవత్సరంలో ఇన్‌స్పైర్ అవార్డులకు నామినేషన్లు వేసిన వివిధ పాఠశాలల నుంచి 136 ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. ఎంపికై న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు అందించింది. వాటితో తయారుచేసిన ఎగ్జిబిట్స్‌తో విద్యార్థులు ప్రదర్శన, ప్రాజెక్ట్‌ల పోటీల ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారు.


