సతాయిస్తున్నాడన్న నెపంతో.. | - | Sakshi
Sakshi News home page

సతాయిస్తున్నాడన్న నెపంతో..

Nov 18 2026 12:02 AM | Updated on Nov 18 2026 12:02 AM

● వాచ్‌మన్‌పై దాడి చేసిన విద్యార్థులు ● మోటార్‌ సైకిల్‌ ధ్వంసం ● కోరుట్ల సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో ఘటన

● వాచ్‌మన్‌పై దాడి చేసిన విద్యార్థులు ● మోటార్‌ సైకిల్‌ ధ్వంసం ● కోరుట్ల సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో ఘటన

కోరుట్ల: తమను అకారణంగా సతాయిస్తున్నాడన్న నెపంతో కోరుట్ల సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో ఇంటర్‌, టెన్త్‌ చదువుతున్న విద్యార్థులు కొందరు వాచ్‌మన్‌పై దాడిచేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గురుకులంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తిరుమల్‌ ప్రతిరోజూ తమపై ప్రిన్సిపాల్‌కు లేనిపోని చాడీలు చెప్పి సతాయిస్తున్నాడని పది, ఇంటర్‌ విద్యార్థులు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రిన్సిపాల్‌ బదిలీపై వెళ్లడంతో వాచ్‌మన్‌పై కోపం పెంచుకున్న విద్యార్థులు.. తిరుమల్‌పై దాడి చేయడంతోపాటు అతడి మోటార్‌ సైకిల్‌ను ధ్వంసం చేశారు. వీరి దాడిలో పాఠశాల గది ఫర్నిచర్‌, అద్దాలు కొంతమేర దెబ్బతిన్నాయి. పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అశోక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శ్యాంరాజ్‌ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. పాత ప్రిన్సిపాల్‌ హయాంలో నెలకొన్న కొన్ని సంఘటనల కారణంగానే ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నామని, తనకు పూర్తి అవగాహన లేదని చెప్పారు.

ముగిసిన ఎస్జీఎఫ్‌ స్విమ్మింగ్‌ పోటీలు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ అండర్‌–14 బాలబాలికల రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో ప్రతిభను చాటారు. విజేతల జాబితాను ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ఆడే రామేశ్వర్‌ వెల్లడించారు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ బాలికల్లో అనిహాశ్రీ(కరీంనగర్‌) కాంస్యం గెలుచుకుంది.

ఘనంగా గోపూజ

ధర్మపురి:శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం గోపూజ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌ గోరక్ష విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహ్‌ గుడ్ల నరహరి హాజరయ్యారు. శ్రీకృష్ణుడు మొదటిసారి గోవులను మేతకు తీసుకెళ్లిన శుభ దినమని, గోవును పోషించడం అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడమేనని పేర్కొన్నారు. పాలెపు ప్రవీణ్‌శర్మ, రాయిల్ల రవికుమార్‌, వీహెచ్‌పీ సభ్యులు ఉన్నారు.

తాగునీటి సరఫరా నిలిపివేత

జగిత్యాల: ఐడీవోసీ వాటర్‌ ట్యాంక్‌ వద్ద వాల్‌ మార్పిడి పనులు చేపడుతున్నందున జగిత్యాల బల్దియాలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు కమిషనర్‌ సత్యప్రణవ్‌ తెలిపారు. బుధవారం నుంచి పనులు ప్రారంభమవుతాయని, పూర్తయ్యేవరకూ హౌసింగ్‌బోర్డు కాలనీ, తులసీనగర్‌, వాణీనగర్‌, కలెక్టరేట్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఉంటుందన్నారు. వాల్‌ మార్పిడి పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement