సినిమా షూటింగ్ లొకేషన్ల పరిశీలన కోసమే పర్యటన? చారిత్రక కట్టడాలు, బురుజులు, ప్రకృతి అందాల సందర్శన షూటింగ్‌కు అనువైన ప్రాంతాలపై ఆరా హీరో పర్యటనతో స్థానికుల్లో ఆసక్తి
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట శివారులోని చారిత్రక రామగిరి ఖిల్లాను సినీ హీరో అక్కినేని నాగచైతన్య మంగళవారం సందర్శించారు. ఖిల్లాపై ఉన్న పురాతన కట్టడాలు, బురుజులు, కోటలు, ప్రకృతి అందాలను ఆసక్తిగా తిలకించారు. ఓ సినిమా చిత్రీకరణ కోసం అనువైన లొకేషన్లను పరిశీలించేందుకే ఆయన వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా పేరు, చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. నాగచైతన్య పర్యటనతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఖిల్లాలో సినిమా షూటింగ్ జరిగితే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు రావడంతోపాటు పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన అనంతరం నాగచైతన్య బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు మహిపాల్‌రెడ్డి, స్థానికులు జంగపల్లి సత్యం, శనిగరం రమేశ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.


