నేడు జిల్లాకు మంత్రి పొన్నం రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు మంత్రి పొన్నం రాక

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

● జిల్లాకేంద్రంలో ‘యంగ్‌ ఇండియా’కు శంకుస్థాపన ● ధర్మపురిలో బస్టాండ్‌ ఆధునీకరణకు ప్రారంభోత్సవం

● జిల్లాకేంద్రంలో ‘యంగ్‌ ఇండియా’కు శంకుస్థాపన ● ధర్మపురిలో బస్టాండ్‌ ఆధునీకరణకు ప్రారంభోత్సవం

జగిత్యాల/ధర్మపురి: రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉదయం 6.30 గంటలకు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ధర్మపురిలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాలలోని యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

మారనున్న ధర్మపురి బస్టాండ్‌

భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులతో ధర్మపురి ఆర్టీసీ బస్టాండ్‌ రూపురేఖలు మారనున్నాయి. ధర్మపురి పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీలక్ష్మినృసింహస్వాములను దర్శించుకుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ పుణ్యక్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు లేక భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌ను అన్ని వసతులతో ఆధూనీకరణ చేయాలని మంత్రి అడ్లూరి మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన రూ.రెండు కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్‌ సత్యప్రసాద్‌, కరీంనగర్‌ ఆర్‌ఎం, జగిత్యాల డీఎంలు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement