● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. న్యాయమైన హక్కులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. వారికి జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వైద్యం ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దసరా, దీపావళి పండుగలను వదిలి ఆందోళన చేస్తున్నారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలో ఆడబిడ్డ పుడితే రూ.12 వేలు, బాబు పుడితే రూ.11 వేలు ఇచ్చేవారని, వీటితోపాటు, న్యూట్రిషియన్ కిట్ అందించారని గుర్తు చేశారు. వైద్యానికి సంబంధించి 60శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇస్తుందని, వీటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో ఎక్కువ ఆడబిడ్డలే ఉన్నారని, సమాన హక్కుకు సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు అన్నారు. ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


