పట్టు పరిశ్రమతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

పట్టు పరిశ్రమతో లాభాలు

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

మేడిపల్లి: పట్టురైతు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఖేతి బచావో అభియాన్‌, సెరికల్చర్‌, పట్టుపురుగుల పెంపకం, ఎల్‌నినో పరిస్థితులు, పంట మార్పిడి పద్ధతులు, ప్రత్యమ్నాయ ఆదాయ మార్గాలపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ములుగు జిల్లా సీనియర్‌ శాస్త్రవేత్త, హెడ్‌ బి.తిరుపం రెడ్డి, రీజినల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, పొలాసకు చెందిన సీనియర్‌ సైంటిస్ట్‌ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎకరం సెరికల్చర్‌ ద్వారా నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఏవో షాహిద్‌ అలీ, ఏఈవోలు సృజన, గంగాలక్ష్మి, దుర్గా, రాజిరెడ్డి, సీఆర్పీలు మరియా, రాజశ్రీ, రైతులు పాల్గొన్నారు.

డ్రోన్‌ సాంకేతికతను వినియోగించుకోవాలి

జగిత్యాలఅగ్రికల్చర్‌: వ్యవసాయ రంగంలో వస్తున్న డ్రోన్‌ సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల సింగిల్‌ విండో ద్వారా రూ.9 లక్షలతో కొనుగోలు చేసిన డ్రోన్‌ను శనివారం ప్రారంభించారు. జిల్లాలో వ్యవసాయమే ప్రధానమని, రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాలన్నారు. డ్రోన్‌తో పంటలకు పిచికారీ చేయడం ద్వారా రైతులకు శారీరక శ్రమ, ఖర్చు తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, సంఘ సీఈవో గాజెంగి వేణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement