జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి నర్సింగరావు శనివారం ధర్మపురి, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు రాగా.. జిల్లా న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్ రావు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, ఎస్పీ అశోక్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు ప్రవీణ్, జున్ను రాజేందర్ హైకోర్టు జడ్జికి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాలక్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీస్ సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడం, సామాజిక బాధ్యతలను గుర్తు చేయడం, ప్రజాసేవపై నిబద్ధతను మరింత బలోపేతం చేయడం, ప్రజానుకూల పోలీసింగ్‌పై అవగాహన కల్పించడం వ్యాసరచన పోటీల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: విపత్తు సమయంలో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు కేసీఆర్ అని, భయభ్రాంతులకు గురిచేసే మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పది నెలలుగా వాతావరణంలో మార్పులు, కరువు పరిస్థితులపై శాస్త్రవేత్తలు హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కన్నెపెల్లి పంపుహౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తే రైతులకు సాగునీటిని అందించి కరువును జయించవచ్చని చెప్పినా.. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. దేశమంతా కరువు వచ్చినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు. ఆమెవెంట మ్యాడారంతండా సర్పంచ్ భారతి, నాయకులు తేలు రాజు, రాంచందర్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్ గౌడ్, రవి, శ్రీనునాయక్, రమేశ్, మహేశ్, ప్రభాకర్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.
● బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు
వ్యాసరచన పోటీలు
ప్రజలకు ధైర్యం ఇచ్చే నేత కేసీఆర్
‘సర్’పె ప్రతిపక్షాల రాద్దాంతం
మెట్‌పల్లి: ఓటరుజాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. పట్టణంలోని ఖాదీ ప్రతిష్టాన్ ఆవరణలో శనివారం చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. సర్ కార్యక్రమం ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటే.. ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరుగుతుందని ఆందోళనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల నిరాధారమైన ఆరోపణలను బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో దొనికెల నవీన్, పూదరి అరుణ, వడ్డెపల్లి శ్రీనివాస్, రుద్ర శ్రీనివాస్, పుల్ల సౌజన్య, వరలక్ష్మీ తదితరులున్నారు.