పర్యావరణ హితం.. బాలల పథం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ హితం.. బాలల పథం

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

● పాఠశాలల్లో ఈ–వ్యర్థాల సేకరణ ● ప్రత్యేక కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం ● విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

● పాఠశాలల్లో ఈ–వ్యర్థాల సేకరణ ● ప్రత్యేక కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం ● విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ సాధనలో విద్యార్థుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఈ–వ్యర్థాలపై అవగాహన పెంపొందించడంతోపాటు వాటిని సురక్షితంగా తొలగించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యక్రమంలో ఎకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ క్యాంపెయింగ్‌ 6 కింద ఈ–వేస్ట్‌ అవగాహన, సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి పాఠశాలలో నాలుగు బాక్స్‌లు

విద్యార్థులను చిన్న వయసులోనే వ్యర్థాలను సరైన పద్ధతిలో తొలగించేందుకు అవగాహన పెంపొందించుకునేందుకు పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా నాలుగు బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తడి చెత్తకు ఆకుపచ్చ డబ్బా, పొడిచెత్తకు నీలం రంగు డబ్బా, మెడికల్‌, శానిటేషన్‌ వ్యర్థాలకు ఎర్ర డబ్బాలు, ఈ–వేస్ట్‌కు నల్ల డబ్బాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

విద్యార్థుల భాగస్వామ్యం

ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయడం తప్పనిసరి. ప్రమాదకరం కాని ఎలక్ట్రికల్‌ వ్యవస్థను ప్రోత్సహించేలా చూస్తున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఇంటి నుంచే అలాంటి వస్తువులను తీసుకొచ్చి ఈ డబ్బాల్లో వేయవచ్చు. ప్రిన్సిపల్స్‌, ఎకో క్లబ్‌ ఇన్‌చార్జిల పర్యవేక్షణలో నిర్వహిస్తుంటారు.

రీసైకర్లకు అప్పగించేలా చర్యలు

పాఠశాలల్లో సేకరించిన ఈ వ్యర్థాలను మండలస్థాయిలో ఒక చోట చేర్చి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన ఆఽధీకృత రీసైకర్లకు ఇవి అప్పగించాల్సి ఉంది. ఈ వేస్ట్‌ సేకరణ వివరాలు, రశీదులను తప్పకుండా చూపించాలి.

మానవాళికి హాని కలగకుండా..

ఈ–వ్యర్థాలలో హానికరమైన విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మానవుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రికల్‌ పరికరాలు, బ్యాటరీలు, టీవీలు ఇలాంటివి సేకరించి రీసైక్లింగ్‌ చేస్తుంటారు. తద్వారా మానవ ఆరోగ్యానికి హాని కలగదు. ఇది ఎంతో మంచి కార్యక్రమం అని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి విద్యార్థి పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చూడాల్సిన బాధ్యత ఉంది.

పోర్ట్‌లో నమోదు చేయాలి:

ప్రతి పాఠశాల విద్యార్థులు సేకరించిన ఈ వ్యర్థాల సేకరణ వివరాలను సంబంధిత పోర్టల్‌ www.ecoc lub.education.gov.in లో నమోదు చేయాల్సి ఉటుంది. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు ఈ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయులు ఎకోక్లబ్‌ ఉపాధ్యాయులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈనెల 28న ప్రత్యేక సేకరణ దినోత్సవం..

ఈ–వ్యర్థాల సేకరణ ప్రత్యేక సేకరణ దినోత్సవం ఈనెల 28న నిర్వహిస్తున్నారు. ఇందులో క్విజ్‌ కార్యక్రమాలు, వీడియోలు, ఫొటోలను ప్రదర్శిస్తారు.

విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలి

పాఠశాలల్లో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణలో విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలి. ఈ–ఎలక్ట్రానిక్స్‌ సేకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎకోక్లబ్‌ ఇన్‌చార్జి ఉపాధ్యాయులు సమన్వయం చేసుకుంటారు. దీని వల్ల విద్యార్థుల్లో సైతం అవగాహన పెరుగుతుంది.

– రాము, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement