అంగన్‌వాడీలపై అనధికారిక ఆధిపత్యం సిబ్బందిని వేధిస్తున్న మహిళా కౌన్సిలర్ల భర్తలు కేంద్రాలకు వెళ్తూ ఇబ్బంది పెడుతున్న వైనం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
‘గురువారం ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ అభియాన్‌కు సంబంధించిన కార్యక్రమం జరుగుతుండగా ఓ మహిళ కౌన్సిలర్ హాజరయ్యారు. అదే సమయంలో కౌన్సిలర్ భర్త వచ్చి ఓ అంగన్‌వాడీ టీచర్ చెయ్యి పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే పట్టుకున్నాడని టీచర్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు’.
‘జిల్లా కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణలో మహిళా కౌన్సిలర్ల భర్తలు అనవసరంగా జోక్యం చేసుకుంటూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఇటీవల టీచర్లు జిల్లా సంక్షేమాధికారికి ఫిర్యాదు చేశారు. తరుచూ కేంద్రాలకు వస్తూ దుర్భాషలాడుతూ అవమానాలకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కౌన్సిలర్లను కాదని వారి భర్తలు వచ్చి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట వినని బీఎల్వోలపై కక్షసాధింపు చర్యలకు పాల్ప డుతున్నారని ఆరోపిస్తున్నారు’.
‘జిల్లా కేంద్రంలోని మరో అంగన్‌వాడీ టీచర్ ఓటరు జాబితా సవరణకు సంబంధించి నోటీసులను ఓటర్లకు ఇస్తుండగా ఓ కౌన్సిలర్ భర్త దుర్భాషలాడినట్లు ఆర్డీవోకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేస్తున్నారు’.
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న టీచర్లను కౌన్సిలర్ల భర్తలు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. త మ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి విధుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకో వడం, ప్రశ్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంగన్‌వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స తుల స్థానంలో పతులే పెత ్తనం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహా రంపై తరుచూ ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సి బ్బందికి ప్ర శాంతమైన వాతావరణం కల్పించాలని, విధుల్లో అనధికారిక జోక్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
ఆందోళనలో టీచర్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళ కౌన్సిలర్ల భర్తల తీరుతో అంగన్‌వాడీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పలువురిపై ఫిర్యాదులు రావడం జిల్లాలో చర్చనీ యాంశంగా మారింది. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. విధులు సక్రమంగా నిర్వహించ డం లేదని ఉన్నతాధికారులకు కంప్లెంట్ చేయడం, వారు చెప్పింది వినకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొంటున్నారు.
టీచర్లకు అనేక విధులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం, హాజరు నమోదు, ఫ్రీస్కూల్ విద్య, గర్భిణిలు, బాలింతలకు సేవలందించడం వంటి బాధ్యతలు, ఇటీవల ఎన్నికల సంఘానికి సంబంధించి సర్ కార్యక్రమం సైతం వారిపై భారంగా ఉంది. కష్టతరం అయినప్పటికీ వారు పనులు చేస్తుండగా, పలువురు మహిళా కౌన్సిలర్ల తీరుతో భయాందోళనకు గురవుతున్నారు.
అధికారుల జోక్యం అవసరం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి భ్రదతతో పాటు, ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మహిళ కౌన్సిలర్ల భర్తలు అధికారిక హోదా లేకున్నా ప్రభుత్వ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటున్నారు.
జోక్యం
చేసుకోవడం సరికాదు
మహిళ కౌన్సిలర్ల భర్తలు
అంగన్‌వాడీ కేంద్రాల విషయంలో జోక్యం చేసుకోవడం తగదు. ఏవైనా లోపాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. అంగన్‌వాడీ టీచర్ల విధులకు ఆటంకం కలిగించవద్దు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.
– భాస్కర్, డీడబ్ల్యూవో


