జగన్నాథపూర్– బోర్నపల్లి గ్రామాల మధ్య హైలెవల్ వంతెన నిర్మాణం కోసం మంత్రి దృష్టికి మరోసారి తీసుకెళ్లాను. అవసరమైతే కేంద్ర మంత్రిని కలిసి నిధుల విడుదలకు కృషిచేయడంతో పాటు, పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం.
– ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
బ్రిడ్జి కోసం ఎంతో కష్టపడ్డా
జగన్నాథపూర్–బోర్నపల్లి మధ్య బ్రిడ్జి కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రులు, అప్పటి సీఎం కేసీఆర్‌ను కలిశా. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో మంత్రి అడ్లూరిని కలిసి తొలి సంతకం ఈ ఫైల్‌పైనే చేయించా. రెండుసార్లు టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం బాధాకరం.– జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి


