జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీహబ్ ఏర్పా టు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రస్తావించారు. ఉత్తర తెలంగాణలో జగిత్యాల ముఖ్యమైన ప్రాంతమని, ఐటీహబ్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాలలో జేఎన్‌టీయూ కళాశాల, బాసర ఐఐటీ వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.
పారదర్శకంగా సర్ ప్రక్రియ
ధర్మపురి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో సర్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. అర్హత గల ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం 2027లో రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి గోదావరి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
తల్లిని పోషించకుంటే భూ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం
మెట్‌పల్లి: తన పేరిట ఉన్న భూమిని కొడుకులు రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత పోషణ పట్టించుకోవడం లేదని మెట్‌పల్లి పట్టణం ఆరపేటకు చెందిన చౌట్‌పల్లి సత్తెమ్మ గత సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘కొడుకులు పోషించడం లేదు’ శీర్షికతో వార్త ప్రచురితం కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గమనించిన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సత్తెమ్మ కుటుంబ సభ్యులతో ఆర్డీవో నర్సింహారావు మాట్లాడారు. ఆమెను పోషించకుంటే తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి తిరిగి తన పేరిట చేయిస్తానని హెచ్చరించారు. అయి తే సత్తెమ్మ పోషణ కోసం ఏటా రూ.50వేల చొ ప్పున ఆమె ఖాతాలో జమ చేయడంతో పాటు ఖర్చుల కింద ప్రతి నెలా రూ.వెయ్యి చెల్లించడానికి ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆర్డీవో సూచన మేరకు అంగీకరించినట్లు తెలిసింది.
చెత్త వాహనాల్లో విగ్రహాలు.. బీజేపీ ఆందోళన
జగిత్యాల: కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాకు 200 మట్టి వినాయక విగ్రహాలను కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. వీటిని మున్సిపాలిటీతో పాటు, వివిధ గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మెట్‌పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 105 విగ్రహాలను చెత్త వాహనంలో తరలించేందుకు సిద్ధమవుతుండగా, బీజేపీ నాయకులు గమనించి ఆందోళన చేపట్టారు. వెంటనే అదనపు కలెక్టర్ రాజాగౌడ్ స్పందించి వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌కు మెమో జారీ చేసినట్లు తెలిసింది. పూజారులతో శుద్ధి చేయించి ఇతర వాహనాల్లో విగ్రహాలను తరలించారు.
అసభ్య ప్రవర్తనపై ఎంపీ ఆగ్రహం
జగిత్యాల/కోరుట్ల: జిల్లాకేంద్రంలో ఓ అంగన్వాడీ టీచర్‌తో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీచర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాను క్షమాపణలు చెపుతున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై వివరాలు సేకరించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు.


